షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బీరువా’

Beeruva1
‘నా ఊపిరి’ ఫేం కన్మణి దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా సినిమాకు ‘బీరువా’- సంజుగాడి ఫ్రెండ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటివలే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వచ్చే వారంలో మోషన్ పోస్టర్ మరియు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెలలో సినిమా విడుదల చేయడనికి సన్నాహాలు చేస్తున్నారు.

రెండు ప్రతిష్టాత్మక సంస్థలు ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, ఉషా కిరణ్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సందీప్ కిషన్ సరసన సురభి హీరోయిన్ గా నటించింది. ఎస్ ఎస్ తమన్ ఫస్ట్ టైం సందీప్ కిషన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

Exit mobile version