ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వారణాసి” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ప్రస్తుతం ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతుంది. అయితే ఈ గ్యాప్ లోనే ఈ ఏడాదిలో రాజమౌళి సినిమాలు బాహుబలి 1 అండ్ 2 లు కలిపి బాహుబలి ది ఎపిక్ గా విడుదల కావడం జరిగింది. ఇక వచ్చే ఏడాది మరో ఐకానిక్ సినిమా రీరిలీజ్ కి తెస్తున్నట్టు వారణాసి టీం కన్ఫర్మ్ చేసింది.
రాజమౌళి కెరీర్లో ఎన్నో భారీ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కానీ టెక్నికల్ గా తాను ఎంతో శ్రమించి తీసిన సినిమా మాత్రం “ఈగ” (Eega). నాచురల్ స్టార్ నాని, సమంత అలాగే సుదీప్ ల కాంబినేషన్ లో చేసిన ఈ సినిమా అప్పుడు హిట్ గా నిలిచింది. మరి ఫైనల్ గా ఈ సినిమాని మరోసారి థియేటర్స్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా వారణాసి టీం నుంచి ట్వీట్ పడింది. 2026లో రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు కానీ డేట్ ఎప్పుడు అనేది రివీల్ చేయలేదు. సో దీనిపై తర్వాత క్లారిటీ రానుంది.
We are bringing Eega to the big screen in 2026. Wait for it.
— Varanasi (@VaranasiMovie) December 27, 2025
