మంచు ఫ్యామిలీతో బెల్లంకొండ కాంప్రమైజ్, నో మోర్ ‘రభస’.

manchu-lakshmi-bellam-konda

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘రభస’ సినిమాను నిర్మించిన బెల్లంకొండ సురేష్ షూటింగ్ నిమిత్తం గంధర్వ మహల్ ను అద్దెకు తీసుకుని తమకు ఇవ్వవలసిన 58 లక్షల రూపాయలను ఇవ్వడం లేదని రెండు రోజుల క్రితం గజేంద్రనాయుడు, మంచు ఫ్యామిలీ అనుచరులు కొందరు బెల్లంకొండ ఆఫీసు ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం రోజుకో కొత్త మలుపు తీసుకుంది.

గతంలో మంచు విష్ణు హీరోగా మా లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేశాం. అప్పట్లో విష్ణుకు కొంత మొత్తం అడ్వాన్సుగా ఇచ్చారు. సరైన కథ కుదరక సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. విష్ణు మాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు. తమకు ఇవ్వవలసిన డబ్బులను గంధర్వ మహల్ ను అద్దె కింద జమ చేసుకోవాలని విష్ణును కోరగా అంగీకరించారని బెల్లంకొండ బృందం వాదన.

ఈ వివాదంలో ఇద్దరు నిర్మాతలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గురువారం ఉదయం మంచు వారింటికి బెల్లంకొండ సురేష్ వెళ్లారు. మోహన్ బాబుతో చర్చించి కాంప్రమైజ్ అయ్యారు. ప్రస్తుతం పోలీస్ కేసులను ఉపసంహరించుకుంటున్నారు. ఇంతటితో ‘రభస’ సినిమా వలన చెలరేగిన రభస సద్దుమణినట్టే అని భావించవచ్చు.

Exit mobile version