నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం ఓ పీరియాడిక్ లవ్ స్టోరీ అని, హీరో హీరోయిన్లు ఇద్దరి మధ్య జీవితంలో వివిధ వయసులలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో బెల్లంకొండ గణేష్ విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు.
గణేష్ ని హీరోగా పరిచయం చేస్తూ బీటెల్‌ప్రొడక్షన్స్ మరియు లక్కీమీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం రథన్ అందిస్తుండగా, వివేక్ ఆత్రేయ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.
