భీమనేని డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్

bellamkonda-srinivas_Bheemi
కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాలో తన డాన్సులు, ఫైట్స్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ జనవరి 3న తన పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేశాడు. ఇప్పటికే సెకండ్ మూవీ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేయడానికి సిద్దమయ్యాడు.

ఇది కాకుండా తన తదుపరి సినిమా విలక్షణ దర్శకులు భీమనేని శ్రీనివాస్ డైరెక్షన్ లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. భీమనేని చివరిగా సుడిగాడు సినిమాతో బిగ్ హిట్ అందుకున్నాడు. గత కొద్ది రోజులుగా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న ఈ సినిమా మేలో సెట్స్ పైకి వెళ్తుంది.

Exit mobile version