రవితేజ ‘బెంగాల్ టైగర్’ ఆడియో అండ్ మూవీ రిలీజ్ డేట్స్

bengal-tiger
ప్రస్తుతం టాలీవుడ్లో మాస్ మసాలా భీభత్సం చేసే హీరో ఎవరు అని చూసుకుంటే మాస్ మహారాజ్ రవితేజ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇటీవలే ‘కిక్ 2’ సినిమాతో పెద్దగా మెప్పించలేకపోయిన రవితేజ ఈ సారి తన బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే మాస పాత్రలో చేస్తున్న సినిమా ‘బెంగాల్ టైగర్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. రవితేజ సరసన అందాల భామలు తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్.

షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతుండడంతో ఈ చిత్ర టీం ఆడియో మరియు మూవీ రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసింది. అక్టోబర్ 17న భీమ్స్ సంగీతం అందించిన ఆడియోని రిలీజ్ చేసి దీపావళి కానుకగా సినిమాని నవంబర్ 5న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. సంపత్ నంది రవితేజ బాడీ లాంగ్వేజ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో తీస్తున్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version