మాస్ మహారాజ్ రవితేజ నుంచి తన అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు ఆశించే పర్ఫెక్ట్ మాసా మసాలా సబ్జెక్ట్ తో చేసిన సినిమా ‘బెనగాల్ టైగర్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే సినిమాలోని మెయిన్ పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్ర టీం ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చెయ్యడానికి సిద్దమైంది. అక్టోబర్ 14న అనగా రేపు ఉదయం 10 గంటలకు బెంగాల్ టైగర్ ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.
అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఆడియోని దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ ఆడియో రిలీజ్ లో మెయిన్ ట్రైలర్ తో పాటు కొన్ని సాంగ్స్ టీజర్స్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. అలాగే త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసి నవంబర్ 5న సినిమాని రిలీజ్ చేయనున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో రవితేజ సరసన తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ బోమన్ ఇరాని విలన్ గా కనిపించనున్న ఈ సినిమాకి రాధా మోహన్ నిర్మాత.
