రవితేజ ‘బెంగాల్ టైగర్’ రిలీజ్ డేట్ మారిందా?

Bengal-tiger
మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తోన్న సినిమా ‘బెంగాల్ టైగర్’. ‘ఏమైంది ఈవేళ’, ‘రచ్చ’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది, రవితేజ స్టైల్లో ఓ మాస్ కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరిన ఈ సినిమా నవంబర్ 5న విడుదల కానుందనే ప్రచారం జరుగుతున్నా, తాజా సమాచారం మేరకు ఈ సినిమా నవంబర్ నెలాఖరుకు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది.

బెంగాల్ టైగర్ సినిమా నవంబర్ 27కు షిఫ్ట్ కానుందని సమాచారం. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఈ మధ్యే విడుదలైన ఆడియో, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో రవితేజ మార్క్ ఎనర్జిటిక్ హిట్ గ్యారంటీ అనే ప్రచారం బాగా జరుగుతోంది. రవితేజ ఎనర్జిటిక్ డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బొమాన్ ఇరానీ, హర్ష వర్ధన్ రానే వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలు ఉంటాయని సినిమా యూనిట్ చెబుతోంది.

Exit mobile version