మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చిన మరో ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘బెత్లేహెం కుటుంబ యూనిట్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నివీన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తాజా వసూళ్లతో రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టబోతోంది.
వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం, లాంగ్ రన్‌లో ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారింది. కుటుంబంతో కలిసి వచ్చి హాయిగా నవ్వుకునేలా ఉన్న ఈ లైట్ హార్టెడ్ ఫ్యామిలీ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా నెక్స్ట్ బిగ్ టెస్ట్ సెప్టెంబర్ 4న ఎదురుకానుంది.
మలయాళంలో విడుదలైన 15 రోజుల తర్వాత తెలుగు, తమిళ డబ్బింగ్ వర్షన్లు సెప్టెంబర్ 4న థియేటర్లలోకి రానున్నాయి. కొత్త వీకెండ్ అడ్వాంటేజ్‌తో పాటు ఇతర భాషల ఆదరణ కూడా తోడైతే ఈ సినిమా రూ. 200 కోట్ల మార్క్‌ను కూడా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
