112 కోట్లతో “భగవంత్ కేసరి”

bagavanth kesari
నందమూరి బాలకృష్ణ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం కి సూపర్ పాజిటివ్ టాక్ రావడం తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 112.18 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీ లీల, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version