రీసెంట్ టైంలో టాలీవుడ్ లో చిన్న బడ్జెట్ తో కూడా ఓ పెద్ద హిట్ కొట్టచ్చు అని నిరూపించిన డైరెక్టర్ మారుతి. అందుకు ఉదాహరణలే ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్, కొత్త జంట సినిమాలు. అలాంటి మారుతి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘భలే భలేమగాడివోయ్’. తెలుగు ప్రేక్షకుల ఇంట్లో తనూ ఒకడుగా కలిసిపోయిన యంగ్ హీరో నాని – అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాటి జంటగా నటించిన ఈ సినిమా ఆడియో లాంచ్ ఆగష్టు 15వ తేదీ సాయంత్రం చాలా గ్రాండ్ గా జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ ఆడియోని రిలీజ్ చేసారు.
ఈ ఆడియో వేడుకలో భలే భలే మగాడివోయ్ ట్రైలర్ ని కూడా లాంచ్ చేసారు. ఈ ట్రైలర్ కో అందరి నుంచీ సూపర్బ్స్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ లో నాని పాత్ర ఎలా ఉంటుందనేది రివీల్ చేసారు. ఈ సినిమాలో నాని ఓ మతిమరుపు పర్సన్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ లో తను మతిపరుపు వ్యక్తిగా చేసిన పెర్ఫార్మన్స్, కామెడీ అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. చూసిన ప్రతి ఒక్కరూ భలే భలే మగాడివోయ్ సినిమా ట్రైలర్ అదిరిపోయిందని కితాబులిస్తున్నారు. అలాగే గోపి సుందర్ అందించిన ఆడియోకి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వారు యువి క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి చేసిన సినిమా ఇది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
