‘భరత్ అనే నేను’ మొదటిరోజు ఏపి, తెలంగాణ వసూళ్లు !

మహేష్ బాబు నటించిన పొలిటికల్ డ్రామా ‘భరత్ అనే నేను’ నిన్న ప్రపంచవ్యాప్తంగా పెద్ద మొత్తం థియేటర్లలో విడుదలైంది. ‘శ్రీమంతుడు’ తర్వాత కొరటాల శివ, మహేష్ బాబులు కలిసి చేసిన సినిమా కావడంతో సినిమాకు భారీ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి. మహేష్ కెరీర్లో ఓపెనింగ్స్ పరంగా మొదటి స్థానంలో ఉన్న ‘శ్రీమంతుడు’ను బీట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న 6వ చిత్రంగా నిలిచింది.

ట్రేడ్ వర్గాల లెక్కల మేరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా రూ.22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఏరియా వసూళ్లు
నైజాం 4.51కోట్లు
సీడెడ్
2.70 కోట్లు
ఉత్తరాంధ్ర
2. 92 కోట్లు
ఈస్ట్
3.21కోట్లు
వెస్ట్
1.82 కోట్లు
కృష్ణ
1.92 కోట్లు
గుంటూరు
4.03 కోట్లు
నెల్లూరు
0.88 కోట్లు
మొత్తం
22 కోట్లు
Exit mobile version