నైజాంలో ‘భరత్ అనే నేను’ వసూళ్ల వివరాలు !

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివల హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘భరత్ అనే నేను’ అభిమానుల ప్రసంశలు అందుకుంటూ అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది. సినిమాపై ఉన్న అంచనాలు మూలాన తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయి వసూళ్లు నమోదయ్యాయి.

ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిలాల్లో నాన్ బాహుబలి-2 రికార్డుల్ని నెలకొల్పిన ఈ సినిమా నైజాం ఏరియాలో కూడ మంచి ప్రదర్శన కనబర్చి మొదటిరోజు సుమారు రూ.4.5 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది. ఇలా చిత్రం విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకోవడంతో మహేష్ బాబు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్మాత దానయ్య కూడ ‘భరత్ అనే నేను’ రూపంలో తన బ్యానర్ కు గౌరవప్రదమైన సినిమా దక్కిందని గర్వపడుతున్నారు.

Exit mobile version