సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది . కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ చిత్రం త్వరలోనే 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా చెన్నైలో కూడా మంచి వసూళ్లను సాధించింది.
ఇకపోతే ఈ సినిమా తమిళ వెర్షన్ కేరళ, తమిళనాడు లో ‘భరత్ ఎనుమ్ నాన్’ పేరుతో ఈరోజు విడుదలైంది. ఈ చిత్రం కేవలం తమిళ నాడులో 190 నుండి 200 స్క్రీన్ లలో ప్రదర్శింపబడుతోంది. . మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని డివివి దానయ్య నిర్మించారు.


