సూపర్ స్టార్ మహేష్ బాబుకి తమిళనాడులో కూడా భారీ స్థాయిలో అభిమానులున్నారన్న సంగతి మనకు తెలిసిందే. ‘స్పైడర్’ చిత్రం రిలీజ్ తరువాత చెన్నై సహా తమిళనాట మిగతా ఏరియాల్లో కూడ మహేష్ పాపులారిటీ మరింత పెరిగింది. ఇది మహేష్ బాబుకి చాలా ఉపయోగపడింది. ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమా చెన్నై లో కలెక్టన్ల వర్షం కురిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ‘భరత్ అనే నేను’ ఒక్క చెన్నై నగరంలోనే రూ.1.65 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి మహేష్ బాబు కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. త్వరలో ఈ చిత్రం తమిళ భాషలో కూడ అనువాదం కానుంది.
