బర్నింగ్ స్టార్ కి స్పెషల్ డే.!

singham123

ఒకే ఒక్క పోస్టర్ తో సోషల్ మీడియాలోనే కాకుండా, సినీ పరిశ్రమలోని అందరి స్టార్స్ కి సుప్రి చితుడైన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. ‘హృదయ కాలేయం’ సినిమా తర్వాత ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు సంపూర్నేష్ బాబు చేస్తున్న మరో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సింగం 123’. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ ట్రైలర్ లో సంపూర్నేష్ బాబు చెప్పిన ‘నాకు బీపీ వస్తే ఏపీ, తెలంగాణ, బీహార్, కర్ణాటక ఇలా దేశం మొత్తం మండిపోద్ది..’, ‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ డైలాగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ రోజు సంపూర్నేష్ బాబుకి మరో స్పెషల్ డే అని చెప్పాలి.. ఎందుకు అంటే ఈ బర్నింగ్ స్టార్ నటించిన సింగం 123 సినిమా ఆడియో నేడు రిలీజ్ కానుంది. ఈ వేడుకని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసారు. ఈ సినిమాతో మంచు విష్ణు రచయితగా మారడమే కాకుండా, తన హోం బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. శేషు మ్యూజిక్ అందించిన ఈ సినిమా ద్వారా అక్షత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మే లేదా జూన్ మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version