‘ధురంధర్ 2’ కోసం అక్కడ బిగ్ స్కెచ్..?

Dhurandhar 2

ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందరూ ఎదురుచూస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం సాధించిన ఘనవిజయంతో, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.

​గతంలో మొదటి భాగం గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురవ్వడంతో నిర్మాతలు దాదాపు 100 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. అయితే, డిజిటల్ విడుదలై తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది. పాకిస్థాన్‌లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది.

​ఈసారి గల్ఫ్ దేశాల్లో సెన్సార్ అడ్డంకులను దాటుకుని సినిమాను విడుదల చేయడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఒకవేళ అక్కడ విడుదలకు మార్గం సుగమం అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం. మొదటి భాగంలో చేసిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ ఈసారి చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందించారు.

Exit mobile version