నైజాంలో మహేష్ టార్గెట్ పెద్దదే

MaheshBabu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు వసూళ్ల పరంగా బలమున్న రీజియన్లలో నైజాం కూడా ఒకటి. మహేష్ ప్రతి సినిమాకు నైజాంలో భారీ ఓపెనింగ్స్ నమోదవుతుంటాయి. అయితే ఈసారి ‘సరిలేరు నీకెవ్వరు’తో మహేష్ ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పితే చూడాలని అయన అభిమానులు ఆశపడుతున్నారు. ఒక్కసారి నైజాంలో టాప్ షేర్స్ నమోదు చేసిన చిత్రాల జాబితా చూస్తే మహేష్ ముందున్న రికార్డ్ పెద్దదనే అనిపిస్తోంది.

ఎందుకంటే ఇక్కడ రూ.9.41 కోట్లతో ‘సాహో’ మొదటి స్థానంలో ఉండగా, రూ.8.10 కోట్లతో ‘సైరా’ రెండో స్థానంలో ‘బాహుబలి-2’ రూ.8.9 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. అలాగే మహేష్ గత చిత్రం ‘మహర్షి’ రూ.6.38 కోట్లతో నాలుగవ స్థానంలో ఉంది. మరి భారీ స్థాయిలో విడుదలవుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈ నాలుగింటిలో ఎన్నింటిని డామినేట్ చేస్తుందో చూడాలి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version