పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘ఫౌజీ’ కోసం అందరికీ తెలిసిందే. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ హిస్టారికల్ సినిమాగా తీస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రీసెంట్ గా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో హైప్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. దీనితోనే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు. అయితే లేటెస్ట్ గా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ బిగ్ అప్డేట్ అందించారు. ఫౌజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని ఆన్ టైం సినిమాని తీసుకొస్తున్నామని ప్రామిస్ చేశారు.
అంతే కాకుండా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 2 ప్రీమియర్స్ తో సినిమా తీసుకొస్తున్నట్టుగా బిగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ కి పండుగ కన్ఫర్మ్ చేశారు. సో రెబల్ గాడ్ ఒరిజినల్ డేట్ కంటే ముందే రాబోతున్నాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తుంది.
