బిగ్ బాస్ 4 – అభిజిత్ పేరిట రచ్చ లేపుతున్న ఫాలోవర్స్.!

Abhijeeth

దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోలానే మన తెలుగులో కూడా బిగ్ బాస్ షో కు అత్యంత ప్రజాదరణ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్ కు కూడా అంతకు మించిన క్రేజ్ ఏర్పడుతుందే తప్ప తగ్గడం లేదు. అయితే ప్రతీ సీజన్లోలానే ఈసారి కూడా కందరు టాప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పటికే ఆడియెన్స్ కు ఒక క్లారిటీ వచ్చింది.

అలా ఇప్పుడు ఉన్న కొద్ది వారిలో అభిజీత్ కూడా ఒకడు. అభిజీత్ తనదైన గేమ్ తో ఫైనెస్ట్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు ఇదే అభిజీత్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము లేపేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కూడా లేని విధంగా ట్రెండ్ చేసి పారేసారు.

ఏకంగా 2 లక్షలకు పైగా ట్వీట్స్ తో అభిజీత్ పేరు జాతీయ స్థాయిలో మోగిస్తున్నారు. వి అడ్మైర్ అభిజీత్ అనే హ్యాష్ ట్యాగ్ తో రెండు లక్షల ముప్పై వేలకు పైగా ట్వీట్స్ చేస్తూ ఇంకా కొనసాగిస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ మాస్ ట్రెండ్ తో ఓ సరికొత్త హిస్టరీనే అభిజీత్ కు బిగ్ బాస్ ఫాలోవర్స్ అందించారని చెప్పాలి.

Exit mobile version