చిక్కుల్లో బిగ్ బాస్ 2 !

Bigg Boss Tamil

లోక నాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్వవహరిస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ సమస్యల్లో పడింది ఈ షో షూటింగ్ ఆపివేయాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈ ఎఫ్ ఎస్ ఐ ) డిమాండ్ చేసింది . ఈ షో లో పనిచేస్తున్న 75 శాతం మంది ముంబై నగరానికి చెందివారు కావడమే దీనికి కారణం అని తెలుస్తుంది .

ఈ సందర్బంగా సంఘం ప్రధాన కార్యదర్శి అంగ ముత్తు షణ్ముగం మాట్లాడుతూ ఈ షో కోసం 75 శాతం ముంబై కు చెందినవారేనని మాకు తెలిసింది ఎఫ్ఈ ఎఫ్ ఎస్ ఐ నిబంధనల ప్రకారం ఇది విరుద్ధం .ఈ షో ఫస్ట్ సీజన్ లో కూడా ఇలాగే జరిగితే కమల్ హాసన్ తో మాట్లాడి మా సంఘం నుండి 50 శాతం మందిని పంపించాం ఇప్పుడు మళ్ళి అలాగే జరుగుతుంది .ఇప్పటికైనా మా సంఘం నుండి సభ్యులని తీసుకోకపోతే ఈ శనివారం నుండి షూటింగ్ ను జరుగనివ్వం అని తెలిపారు .

Exit mobile version