ఏకంగా 250 కోట్లు కొల్లగొట్టిన స్టార్ హీరో

Bigil2

కోలీవుడ్ లో రజిని కాంత్ తరువాత అంతటి స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ ముందువరుసలో ఉంటారు. కొన్నేళ్లుగా వరుస హిట్లు అందుకుంటూ ఆయన మాస్ ఫాలోయింగ్ ని విపరీతంగా పెంచుకున్నారు. ఆయన ఇటీవల నటించిన తేరి, మెర్సల్, సర్కార్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఆయన తాజా చిత్రం బిగిల్ కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. గత నెల 25న దీపావళి కానుకగా విడుదలైన బిగిల్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు తమిళ భాషలలో బైలింగ్వల్ మూవీగా వచ్చిన బిగిల్ ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250కోట్లు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగులో విజిల్ గా విడుదలైన ఈ చిత్రం 10కోట్ల మార్క్ వసూళ్లు దాటివేయడం గమనార్హం.

తెలుగులో విజిల్ విజయ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విజయ్ బిగిల్ మూవీ ద్వారా తన మార్కెట్ ని భారీగా పెంచుకున్నారు. యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జంటగా నయనతార నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. అట్లీ-విజయ్ కాంబినేషన్ లో వచ్చిన బిగిల్ హ్యాట్రిక్ హిట్ కావడం గమనార్హం.

Exit mobile version