‘బిగిల్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

Bigili

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌. కాగా ఈ చిత్రానికి తెలుగులో విజిల్ అని పేరు పెట్టారు. కాగా దసరా సందర్భంగా ఈ సినిమా తమిళ వెర్షన్ యొక్క ట్రైలర్ ఈ నెల 12 న విడుదల చేయనున్నారు. ఇక విజయ్ అట్లీ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి.

ఇక న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌గా తెలుగు, త‌మిళంలో సినిమాను ఏక కాలంలో విడుద‌ల చేస్తున్నారు. హీరో విజ‌య్‌ కెరీర్‌ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది. స్పోర్ట్ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందుతున్న క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ ఈ సినిమా.

Exit mobile version