
ఈ పిజ్జా లో ఒక ముక్క తీసుకోండి అని ఒక సినిమా విశ్లేషకుడు రాసాడు. ఆ చిత్రం చాలా మంచి హిట్ అవ్వడంతో వెంటనే ఆ చిత్రాన్ని మించిన ఒక సీక్వెల్ కూడా వచ్చింది. ‘పిజ్జా’ రిలీజ్ అవ్వకముందు మలయాళం లో విడుదల అయిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రంతో వంటకాల పేరు చుట్టూ సినిమా పేరులు పెట్టడం క్రేజ్ సంపాదించుకుంది.
రామ్ గోపాల్ వర్మ నవదీప్ హీరోగా ‘ఐస్ క్రీం’ విడుదల చేయనున్నాడు. స్వాతి చిత్రం ఒకటి ‘కుల్ఫీ’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. కొంత మంది ఈ చిత్రాన్ని ‘చీని కం’ తో పోల్చారు. ‘కుదిర్తే కప్పు కాఫీ’ ‘అవకాయి బిర్యానీ’ ‘బిర్యానీ’ (కార్తి చిత్రం) పప్పు బాక్స్ఆఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. లడ్డు బాబు అయితే కనీసం ఒక రోజు రెండు రోజులు కూడా ధియేటర్లలో ఆడలేదు.
మనకి స్నాక్స్ ఫ్రూట్స్ కూడా వున్నాయి. ‘మిర్చి’ ‘ఆరంజ్’ ‘బిస్కట్’ అలాగే ‘చింతకాయల రవి’. మల్టీస్టారర్ ‘మసాలా’ కూడా బాక్స్ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది.
నిర్మాతలు తిండికి పానియలకి సంభందించిన మరికొన్ని పేర్లతో చిత్రాలు తీస్తారేమో చూడాలి. లేకపోతే చిత్రంలోని కధ కి సంబంధం వున్న మంచి పేర్లను మాత్రమే పెట్టాలని ఆలోచిస్తారేమో వేచిచూడాలి.