‘బాలయ్య – కొరటాల శివ’ సినిమా కథ అదేనా ?

Koratala Siva

బాలయ్య బాబు – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని బలంగా వినిపిస్తోంది. పైగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడట. మే నెలలో చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఐతే తాజాగా ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొరటాల శివ ఓ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ ను డిజైన్ చేశారని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో భారీ మాస్ సీక్వెన్సెస్ ఉంటాయని.. అందుకు తగ్గట్టు.. బాలయ్య పాత్ర పై చుట్టూ ఓ బలమైన డ్రామాను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

అన్నట్టు ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య బాబు పాత్ర మాఫియా నేపథ్యంలో ఉంటుందట. మొత్తానికి ఈ సినిమాలో బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version