‘మహాకాళి’లో జాయిన్ అయిన బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే..?

టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘హను-మాన్’ వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత వస్తున్న ఈ సిరీస్‌తో ప్రశాంత్ వర్మ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

బాలీవుడ్ యంగ్ యాక్టర్ రోహిత్ సరాఫ్ ‘మహాకాళి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరిగిన సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్‌ను రోహిత్ సరాఫ్ ఇటీవల పూర్తి చేసుకున్నాడు. సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన నటనతో రోహిత్ ప్రేక్షకులను మెప్పిస్తాడని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టించిన ఈ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ‘మహాకాళి’లో సీనియర్ నటుడు అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌కెడి స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్‌కె దుగ్గల్ మరియు రివాజ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version