సునీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ.?

sunil-and-Prachi-Desai1
కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుడు సునీల్. సునీల్ హీరోగా చేసిన ‘భీమవరం బుల్లోడు’ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది పైనే అయ్యింది. కానీ ఇప్పటికీ సునీల్ మరో సినిమా రిలీజ్ కాలేదు. భీమవరం బుల్లోడు సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సునీల్ వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం వాసు వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సునీల్ ఇటీవలే వంశీ ఆకెళ్ళ డైరెక్షన్ లో చేయనున్న సినిమాని మొదలు పెట్టాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ చిత్ర టీం ఈ సినిమాలో సునీల్ కి జోడీ కోసం ఓ ఫ్రెష్ ఫేస్ ని పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే ‘రాక్ ఆన్’, ‘వన్స్ అపాన్ అ టైం ఇన్ ముంబై’, ‘బోల్ బచ్చన్’ సినిమాలతో మెప్పించిన బాలీవుడ్ బ్యూటీ ప్రాచి దేశాయ్ ని అప్రోచ్ అయ్యారు. ఇప్పటికే వంశీ ఆకెళ్ళ ప్రాచిని కలిసి ఈ సినిమా కథ చెప్పాడు. ప్రాచి దేశాయ్ కి కూడా కథ నచ్చడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్నీ ఓకే అయితే ప్రాచి దేశాయ్ ఈ సినిమాతో తెలుగులో పరిచయం అవుతుంది. ప్రేమకథా చిత్రమ్’ నిర్మాత అయిన సుదర్శన్ రెడ్డి ఆర్.ఫై.ఏ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

Exit mobile version