యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ ఒక్కొక్క సినిమా తో తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నారు. RRR చిత్రం తో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పాలి. కేవలం దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా, చిత్రం విడుదలైన అన్ని చోట్ల నుండి ఎన్టీఆర్ నటన కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆస్కార్స్‌లో ఉత్తమ నటుడి అవార్డు కోసం వెరైటీ యొక్క పోటీదారుల జాబితాలో ఈ నటుడు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఈ రోజు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆమె ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె అతన్ని కష్టపడి పనిచేసే మరియు వినయపూర్వకమైన సహనటుడు అని పిలిచింది. అప్పట్లో ఎన్టీఆర్ సూపర్ స్టార్ అని, ఆ నటుడికి అంతటా ప్రేమ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని అమీషా తెలిపింది. అమీషా పటేల్ కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న త్రోబాక్ చిత్రాన్ని షేర్ చేసింది. 2005 లో విడుదలైన నరసింహుడు చిత్రంలో ఎన్టీఆర్ మరియు అమీషా పటేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
THROWBACK WEEKEND.. a cute pik from my Telugu film w/ junior NTR .. he was a huge TELUGU SUPERSTAR then as well n today seeing him getting such PAN INDIA love with the film RRR makes me soo happy .. lovely co star .. hardworking and humble ???????????????????????????? pic.twitter.com/sCcfrmVvis
— ameesha patel (@ameesha_patel) September 18, 2022