ప్రభాస్ నెక్స్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్?

prabhas-and-neil-mukesh
‘బాహుబలి’ సినిమా విడుదలయ్యేంత వరకూ ఒక్క సౌతిండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ స్టార్‌డమ్, బాహుబలితో దేశవ్యాప్తంగా విస్తరించింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా వేరే ఏ ఇతర ప్రాంతీయ సినిమాకూ సాధ్యపడని రికార్డులను కొల్లగొట్టి బాక్సాఫీస్ వద్ద రారాజుగా నిలబడిన విషయం తెలిసిందే! దీంతో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్, విలన్ రానాలు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం ఈ టీమ్ బాహుబలి రెండో భాగమైన ‘బాహుబలి ది కంక్లూజన్‌’పై పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ‘బాహుబలి 2’ సెట్స్‌పైకి వెళ్ళనుంది.

ఇదిలా ఉంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాకు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ‘రన్ రాజా రన్’ ఫేం సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్ పాత్రకు బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముఖేష్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. నీల్ నితిన్ ముఖేష్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కత్తి’ సినిమాతో సౌతిండియన్ సినిమాకు పరిచయమయ్యారు.

కత్తి సినిమాలో నితిన్ నటన సినిమా ఇంటెన్సిటీని మరింత పెంచిందనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ సరసన నితిన్ ముఖేష్ విలన్‌గా నటించనున్నారనే వార్త అభిమానులకు మంచి ఎగ్జైటింగ్ వార్తే అని చెప్పుకోవచ్చు. అయితే అక్టోబర్‌లో మొదలు కానున్న బాహుబలి పార్ట్ 2 పూర్తయ్యాకే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Exit mobile version