గత ఏడాది ఎండింగ్ లో అలానే ఈ ఏడాది ఆరంభంలో మంచి అంచనాలు నడుమ వచ్చిన చిత్రాలు బాలయ్య నటించిన అఖండ 2 అలానే ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఒకే సమయంలో బుల్లితెరపై స్ట్రీమింగ్ కి వచ్చాయి.
గత కొన్ని రోజులు కితమే జీ తెలుగు ఛానెల్ లో అఖండ 2 అలానే స్టార్ మా లో రాజా సాబ్ మొదటిసారి ప్రసారం కాగా వీటిని ఇంట్రెస్టింగ్ గా దాదాపు సమానమైన రెస్పాన్స్ అందులోని చెప్పుకోదగ్గ రేంజ్ లోనే రెస్పాన్స్ రావడం అనేది జరిగింది. అఖండ 2 కి గాను 4.54 రేటింగ్ రాగా తమిళ్ లో 1.6 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది.
ఇక రాజా సాబ్ చిత్రానికి తెలుగులో 4.4 రేటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. వీటికి బాక్సాఫీస్ దగ్గర వచ్చిన టాక్ కి టెలివిజన్ స్క్రీన్ పై చేసిన పెర్ఫామెన్స్ కి మాత్రం చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో పలు బ్లాక్ బస్టర్ సినిమాలకి కూడా 5 రేటింగ్స్ లాంటివి వచ్చాయి. సో వాటితో పోలిస్తే ఈ రెండు సినిమాలు బుల్లితెరపై హిట్టే అనుకోవాలి.
