బోయపాటి స్టైల్ మార్చనున్నాడు !

boyapati1

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమా ప్లాప్ తరువాత మరో సినిమా కోసం చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ‘వినయ విధేయ రామ’ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం సినిమాలో యాక్షన్ అండ్ ఎమోషన్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమే. అందుకే బోయపాటి, నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమాలో యాక్షన్ ను కాస్త నమ్మేవిధంగా రియలిస్టిక్ గా తీయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒక హీరోయిన్ గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్ ను తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అట.

ఇక ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే, వీళ్ళు హ్యాట్రిక్ హిట్ కొట్టినట్లే. మరి ప్లాప్ ల్లో ఉన్న ఈ హిట్ కాంబినేషన్ హిట్ కొడుతుందా ? చూడాలి.

Exit mobile version