మన టాలీవుడ్ ఆడియెన్స్ మాస్ పల్స్ బాగా తెలిసిన స్టార్ దర్శకుల్లో బోయపాటి శ్రీను కూడా ఒకరు. తనదైన శైలి మాస్ టేకింగ్ తో తన హీరోలకి మాస్ ఇమేజ్ ని అందించడం తన స్పెషాలిటీ. అయితే గత చిత్రం అఖండ 2 తాండవం బాక్సాఫీస్ దగ్గర ఊహించని ఫలితాన్ని చూడాల్సి వచ్చింది. మరి నెక్స్ట్ తన సినిమా ఏంటి? ఎవరితో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నిలిచింది.
కానీ లేటెస్ట్ బజ్ గా ఊహించని హీరో బోయపాటితో సినిమా ఓకే అయ్యినట్టు వినిపిస్తుంది. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు కోలీవుడ్ నటుడు తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా ఇష్టమైన కార్తీ అట. ఇది వినడానికే ఒకింత సర్ప్రైజింగ్ గా ఉందని చెప్పాలి. అప్పటివరకు ఒక రకమైన ఇమేజ్ ఉన్న హీరోలకి మంచి మాస్ అపీల్ అందివ్వడం బోయపాటి స్పెషాలిటీ మరి ఇదే విధంగా కార్తీని కూడా ఎలా ఛేంజ్ చేస్తారో చూడాలి. ముందుగా ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది.
