బోయపాటి ‘స్పెషల్’ ప్లానింగ్.. ‘అఖండ 2’లో స్టన్నింగ్ సీక్వెన్స్..

akhanda

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేస్తున్న భారీ చిత్రమే “అఖండ 2 తాండవం”. నెక్స్ట్ లెవెల్ హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రంని అందుకు తగ్గట్టుగానే బోయపాటి తన మార్క్ మాస్ అండ్ ఎలివేషన్స్ మూమెంట్స్ తో నింపేస్తూ ప్లాన్ చేస్తున్నారు.

అయితే బోయపాటి చిత్రాల్లో చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం ఊహించని రీతిలోనే ఉంటాయి. కొన్ని కొన్ని పర్టిక్యులర్ లొకేషన్స్ లో ఆయా యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అయ్యినవి కనిపిస్తాయి. ఇలా జయ జానకి నాయక లో హంసల దీవి ఫైట్ కానీ వినయ విధేయ రామ లో షర్ట్ లెస్ యాక్షన్ సీక్వెన్స్ ఇంకా కొన్ని కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ తన చిత్రాల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఇలానే అఖండ 2 లో కూడా ఒక స్పెషల్ లొకేషన్ లో భారీ సీక్వెన్స్ ని బోయపాటి తెరకెక్కిస్తున్నారట. అది కూడా మంచు పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ లు, ప్యాంజెర్ లు, ట్రక్ లతో ప్లాన్ చేసిన ఎపిసోడ్ కోసం ఇపుడు వినిపిస్తుంది. ఇదే సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అన్నట్టుగా కూడా టాక్. మరి బిగ్ స్క్రీన్స్ పై అఖండ 2 లో ఈ సన్నివేశం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version