Boyapati – Bollywood: బాలీవుడ్ లోకి బోయపాటి అడుగు?

Boyapati-Sreenu

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ దర్శకుల్లో బోయపాటి (Boyapati) శ్రీను కూడా ఒకరు. మొదటి సినిమా నుంచే తన మార్క్ మాస్ ని చూపిస్తూ తాను వర్క్ చేసిన ప్రతీ హీరో లోని సాలిడ్ మాస్ యాంగిల్ ని ప్రెజెంట్ చేసిన బోయపాటి రీసెంట్ గానే బాలయ్యతో అఖండ 2 అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మాస్ చిత్రాన్ని తాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితో అనేది ఇంకా బయటకి రాలేదు.

కానీ లేటెస్ట్ రూమర్స్ కొన్ని ఇప్పుడు వినిపిస్తుంది. వీటి ప్రకారం బోయపాటి నెక్స్ట్ అడుగు బాలీవుడ్ లో అట. మరి తన మాస్ ని మ్యాచ్ చేసే హీరో ఎవరు? నిర్మాత ఎవరు అనేవి ఇంకా బయటకి రాలేదు. హిందీ జనంలో తన సినిమాలు సరైనోడు, జయ జానకి నాయక చిత్రాలకి యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ఉంది. మరి డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమా అంటే దాని ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉంటుంది అని చెప్పొచ్చు. మరి ఈ క్రేజీ ఎంట్రీపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version