
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’. సెప్టెంబర్ 16న తిరుపతిలో మొదటి షెడ్యూల్ ప్రారంభించిన ఈ చిత్ర టీం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్లో షూట్ చేసిన పార్టీ సాంగ్ తో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసారు. ఆ తర్వాత షూటింగ్ కి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కి సిద్దమవుతోంది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కోసం ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ సెట్ ని వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్ ని డిజైన్ చేస్తున్నారు.
మాకున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 5 నుంచి ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలవుతుంది. మహేష్ బాబు కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. సెకండ షెడ్యూల్ కంటిన్యూగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. శ్రీకాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ గా చేసుకొని చేస్తున్న ఈ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. పివిపి బ్యానర్ పై పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. పివిపి ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తూ ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో సినిమాని నిర్మిస్తున్నాడు.