
ఈ ఏడాది ‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొదటి షెడ్యూల్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్లో ఓ సూపర్బ్ ఫంక్షన్ సాంగ్ ని చూస్తే చేసిన ఈ చిత్ర టీం ఇటీవలే రెండవ షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేసారు. శరవేగంగా జరుగుతున్న ఈ షెడ్యూల్ ఈ నెలాఖరి వరకూ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఆ తర్వాత ఓ స్మాల్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం ఊటీ వెళ్లనుంది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం టీం నవంబర్ మొదటి వారంలో ఓ వారం రోజుల షెడ్యూల్ కోసం ఊటీ వెళ్లనున్నారు. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ హైదరాబాద్ కి షాఫ్ట్ అవుతుంది. విజయవాడ బ్యాక్ డ్రాప్ ని బేస్ చేసుకొని చేస్తున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మహేష్ బాబు ముగ్గురు భామలతో రొమాన్స్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకి పివివి నిర్మాత. వచ్చే ఏడాది మార్చి కల్లా అన్నీ ఫినిష్ చేసి ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన ఈ సినిమాకి మికీ జె మేయర్ మ్యూజిక్ డైరెక్టర్.