తిరుపతిలో మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్ షెడ్యూల్

bramotsam
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి పూర్తి కుటుంబకథా చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో చేస్తున్న పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం’. ఇటీవలే రిలీజ్ అయిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో సెకండ్ ప్లేస్ కొట్టేసింది. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీ గా ఉన్న మహేష్ బాబు ఫుల్ ఎనర్జీతో సెప్టెంబర్ 16 నుంచి బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 16 నుంచే ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు.

అందుకోసం టెంపుల్ సిటీ అయిన తిరుపతిని ఎంచుకున్నారు. అనగా బ్రహ్మోత్సవం ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో మొదలు కానుంది. ఆ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొననున్నాడు. సెప్టెంబర్ 16 నుంచి ఆగకుండా ఏకధాటిగా షూటింగ్ చేసే విధంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. కంటిన్యూగా షూటింగ్ చేసి 2016 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణిత హీరోయిన్స్ గా కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి బ్యానర్ పై ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.

Exit mobile version