రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమవుతోన్న ‘బ్రహ్మోత్సవం’!

రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమవుతోన్న ‘బ్రహ్మోత్సవం’!

Published on Sep 9, 2015 12:12 AM IST

bramotsam
‘శ్రీమంతుడు’ సక్సెస్‌తో సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ మరింత ఎత్తుకెళ్ళింది. ఆగష్టు 7న మహేష్ పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాక, మహేష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక గత కొద్దిరోజులుగా ‘శ్రీమంతుడు’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్, ప్రస్తుతం తన కొత్త సినిమా ‘బ్రహ్మోత్సవం’ కోసం సిద్ధమవుతున్నారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ అందమైన ఫ్యామిలీ డ్రామాను మనకు అందించిన మహేష్-దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే.

పీవీపీ సంస్థ నిర్మిస్తోన్న ‘బ్రహ్మోత్సవం’ ఓ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కనుంది. ఇప్పటికే లాంఛనంగా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, ఈనెల 16నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక త్వరలోనే బ్రహ్మోత్సవం షూటింగ్ మొదలుకానుందని తెలియజేస్తూ, ఈ సినిమా పట్ల చాలా ఎగ్జైటింగ్ ఉన్నట్లు పీవీపీ సంస్థ తెలిపింది. విజయవాడ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో మహేష్ రఫ్ లుక్‌లో కనిపిస్తారని సమాచారం. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాలో భారీ తారాగణమే ఉండనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు