శ్రీ విష్ణు, నివేదా థామస్, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రల్లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బ్రోచేవారెవరురా’. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మొదటి రోజునుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని విజయం వైపుగా దూసుకుపోతుంది. శ్రీవిష్ణు,నివేదా థామస్ ల నటనతో పాటు స్టార్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి కామెడీ టైమింగ్ సినిమాలో బాగా వర్క్ అవుట్ ఐయ్యాయి.
ఐతే ఇప్పడు “బ్రోచేవారెవరువా” టీం తెలుగు రాష్ట్రాలలో విజయ యాత్ర చేయనున్నారట. దర్శకుడితో పాటుగా శ్రీవిష్ణు,నివేదా థామస్,ప్రియదర్శి,రాహుల్ రామకృష్ణ కలిసి ఈ విజయ యాత్ర చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని నివేదా స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇలాంటి విజయ యాత్రలు సినిమా వసూళ్ల పెరుగుదలకు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.
Broche Success Touring with the Team! ? @sreevishnuoffl @priyadarshi_i @vishnuviv @hasithgoli PC – dearest Vivek Sagar #Brochevarevarura pic.twitter.com/UR5Eu59Dns
— Nivetha Thomas (@i_nivethathomas) July 4, 2019
