బోల్డ్ బ్యూటీ నిధి అగర్వాల్ కి ప్రస్తుతం “హరిహర వీరమల్లు సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే ఉంటుందట. ఈ సినిమాతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘ది రాజా సాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కూడా నిధి అగర్వాల్ కూడా నటిస్తోంది. ఐతే, సినిమాలు చేయడంలో తనకు తొందర లేదని, మంచి సినిమాల్లో భాగమవడం కోసమే టైమ్ తీసుకుంటున్నట్లు నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
నిధి అగర్వాల్ పై కామెంట్స్ చేయడానికి కారణం ఓ నెటిజన్ పెట్టిన నెగిటివ్ పోస్టే. ఇంతకీ, ఆ నెటిజన్ ఏం పోస్ట్ పెట్టాడంటే.. ‘ఇస్మార్ట్ శంకర్ (2019) తర్వాత నిధి ఎన్ని సినిమాలు చేసింది ?, 2021లో వచ్చిన శ్రీలీల 20+ మూవీస్ చేసింది’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కి నిధి అగర్వాల్ రిప్లై ఇస్తూ.. ‘2019 తర్వాత తెలుగులో హీరో మూవీ, తమిళంలో 3 సినిమాలు చేశా. తర్వాత హరిహర వీరమల్లు, రాజాసాబ్ చేస్తున్నా. బ్రదర్.. నా గురించి బాధపడొద్దు’ అని ఆమె కౌంటర్ ఇచ్చింది.
