
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమా నవంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటించడమే కాకుండా ఈ సినిమాకి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. దాంతో ఈ సినిమా విజయంపై అల్లరి నరేష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండడం వలన రిలీజ్ ని భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. నిజాం లో అల్లరి నరేష్ ఓన్ రిలీజ్ చెయ్యడమే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ రిలీజ్ కి ప్లాన్ చేసారు.
అల్లరి నరేష్ కామెడీ ఎంటర్ టైనర్స్ కి ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ సినిమా కూడా ఓవర్సీస్ లో అల్లరి నరేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సృష్టించింది. అదే రీతిలో బ్రదర్ అఫ్ బొమ్మాళి ని కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఒక్క యుఎస్ లోనే 31 ఏరియాల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబదించిన డిజిటల్ ప్రింట్స్ కూడా యుఎస్ కి చేరిపోయాయి. ఓవర్సీస్ లో అల్లరి నరేష్ సినిమా 31 సెంటర్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే ప్రధమం.
ఈ సినిమాలో అల్లరి నరేష్ కి చుక్క చూపించే సిస్టర్ పాత్రలో కార్తీక నటించింది. బి.చిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాని అమ్మిరాజు కానుమిల్లి నిర్మించాడు. సెన్సారు నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.