‘బ్రూస్ లీ’ నైజాం కలెక్షన్స్ రిపోర్ట్!

bruce-lee

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్రూస్ లీ’. మెగాస్టార్ చిరంజీవి చాలాకాలం తర్వాత తెరపై కనిపించిన సినిమా కావడంతో విడుదలకు ముందు బ్రూస్ లీపై అంతటా విపరీతమైన అంచనాలు కనిపించాయి. ఇక ఆ అంచనాలకు తోడు ఈ సీజన్‌లో వస్తోన్న సినిమాల్లో అతిపెద్ద సినిమా కూడా ‘బ్రూస్ లీ’నే కావడంతో మొదట్నుంచీ ఈ సినిమా క్రేజీ ప్రాజెక్టుగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే భారీ అంచనాల మధ్యన గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి.

నైజాంలో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ 6.27 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. మొదటి షో నుంచే మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం కొంత మైనస్ అయినా బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతం మంచి కలెక్షన్లే వచ్చాయి. కాగా ఈ వారం దసరా సెలవులు కావడం, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెయిన్‌గా టార్గెట్ చేసిన సినిమా కావడంతో బ్రూస్ లీకి ఈ వారం కూడా మంచి కలెక్షన్లే వచ్చే సూచనలున్నాయి.

ఇక నైజాం ఏరియాలో ఓవరాల్‌గా లాంగ్ రన్‌లో బ్రూస్ లీ సినిమా 10-11 కోట్ల రూపాయల వరకూ వసూలు చేసే అవకాశం ఉందని ఈ ఏరియా డిస్ట్రిబ్యూషన్ వర్గాల సమాచారం. వాస్తవానికి ఈ సినిమాకు ఈ ఏరియాలో ఇంతకు చాలా ఎక్కువ కలెక్షన్స్ సాధించే సామర్ధ్యం ఉన్నా కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ కలెక్షన్స్‌కు అడ్డుకట్టగా మారిందని టాక్! రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కృతి కర్బంధ రామ్ చరణ్ అక్కగా నటించారు.

Exit mobile version