రేపు సెన్సార్ ముందుకు చెర్రీ ‘బ్రూస్ లీ’!

Bruce-Lee1
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందిస్తోన్న బ్రూస్ లీ సినిమా దసరా సీజన్‌కు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న సినిమా కావడంతో ఈ సినిమా పట్ల అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా యూనిట్ కూడా ఈ సినిమాను అన్నివిధాలా ది బెస్ట్ అనిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. తాజాగా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమాను రేపు (అక్టోబర్ 10న) సెన్సార్ కార్యక్రమాలకు పంపనున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 15వ తేదీని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసుకున్న సినిమా యూనిట్, రిలీజ్ డేట్‌కు వారం రోజులే ఉండడంతో ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసే పనిలో ఉంది. రేపు సెన్సార్ పూర్తయిన వెంటనే రామ్ చరణ్, శ్రీనువైట్లలతో సినిమా యూనిట్ మొత్తం భారీ ఎత్తున ప్రచారం చేపట్టనున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించగా కృతి కర్బంద ఓ కీలక పాత్రలో నటించారు. ఇక థమన్ అందించిన సంగీతం ఇప్పటికే అంతటా మారుమోగుతూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

Exit mobile version