తన అభిమానులు కోరుకునే పక్కా మాస్ మసాలా చిత్రాలను ప్రేక్షకులకు అందించే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే అందించనున్న మరో కమర్షియల్ సినిమా ‘బ్రూస్ లీ’. ది ఫైటర్ అనేది ట్యాగ్ లైన్. చివరి రెండు రోజుల షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది, అంటే ఇంకా 9 రోజులు మాత్రమే టైం ఉండడంతో ఈ చిత్ర టీం పోస్ట్ ప్రొడక్షన్ వేగం పెంచింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 2న బ్రూస్ లీ ఆడియో లాంచ్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
అంతే కాకుండా ఈ సినిమా యు ట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ విడుదల చేసిన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ట్రైలర్ 10 లక్షల/1 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. కేవలం 4 రోజుల్లో ఇన్ని క్లిక్స్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీంతో మెగా అభిమానులతో పాటు ఈ చిత్ర టీం కూడా చాలా చాల హ్యాపీ హ్యాపీగా ఉంది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ మిక్స్ చేసి శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ జంటగా నటించింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి 3 నిమిషాల పాటు కనిపించనుండడం విశేషం. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.
