రౌడీల పని పడుతున్న అల్లు అర్జున్

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ లో శరవేగంగా జరుగుతోంది. గత కొద్ది రోజుల వరకూ ఈ సినిమా షూటింగ్ కోక పేట్ లో వేసిన ఓ స్పెషల్ సెట్ లో జరిగింది. ఇప్పుడు షూటింగ్ అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ కి షిఫ్ట్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం అల్లు అర్జున్, రౌడీ గ్యాంగ్ పై వచ్చే ఓ ఫైట్ ని షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ లో అల్లు అర్జున్ పరిగెత్తించి మరీ రౌడీల పని పడుతున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ చాలా స్టైలిష్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో స్పోర్ట్స్ లుక్ లో కనిపించనున్నాడు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో బన్ని మొదటి సారిగా ముగ్గురు భామలతో ఆడిపాడుతున్నాడు. ఆ అందాల భామలే సమంత, ఆద శర్మ, నిత్యా మీనన్. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, స్నేహ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీం ఈ సినిమాని ఫిబ్రవరి 5న సినిమాని రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేసారు.

యంగ్ తరంగ్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ – రాధాకృష్ణ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.

Exit mobile version