‘రేసు గుర్రం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఓ పాత్ర చేయనున్నాడని తెలియజేశాము. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపేంద్ర నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
దాంతో మేము ఈ చిత్ర టీంలోని సన్నిహితులతో సంప్రదించగా అల్లు అర్జున్ మూవీలో ఉపేంద్ర నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం లేదని, కానీ తను చేస్తున్నది సినిమాలో చాలా కీలకమైన పాత్ర అని చెప్పారు. అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. అందులో ఇప్పటికే సమంత, ఆద శర్మ ఫైనలైజ్ కాగా మరో హీరోయిన్ గా ప్రణితని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. సీనియర్ నటి స్నేహ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.
హారిక – హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ‘జులాయి’ తర్వాత అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
