
ఇండియన్ క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ది చెరిగిపోని పేరు. ఇండియాలో క్రికెట్‌కు ఓ సరికొత్త క్రేజ్‌ను తెచ్చిపెట్టిన వారిలో ఒకరుగా నిలిచిన కపిల్ దేవ్‌ను అమితంగా అభినందించే వ్యక్తుల జాబితాలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. తాజాగా తాను ఎంతగానో అభిమానించే క్రికెటర్ అయిన కపిల్ దేవ్ నుండి అర్జున్ ప్రశంసలు అందుకోవడం ఆసక్తికరంగా కనిపించింది. ఈమధ్యే అల్లు అర్జున్, తన భార్య స్నేహతో కలిసి క్రికెటర్ కపిల్ దేవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల గురించి ఈ ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు.
ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటన గురించి కపిల్ దేవ్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారట. ఈ కామెంట్స్‌తో థ్రిల్ ఫీలయిన అల్లు అర్జున్, తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు. కపిల్ దేవ్‌ని కలిసి ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడానని, ఈ సందర్భంగా ఆయన, తాను నటించిన రేసుగుర్రం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడం ఆనందాన్నిచ్చిందని బన్నీ తెలిపారు. హిందీలో డబ్ అయి టీవీలో ప్రసారమైన రేసుగుర్రం సినిమాను చూసిన కపిల్, ఈ సినిమాలో అల్లు అర్జున్ కనబరిచిన నటనను మెచ్చుకున్నారట. ఇక తాను ఎంతగానో అభిమానించే క్రికెటర్ వద్ద నుండి కాంప్లిమెంట్స్ దక్కడంతో బన్నీ ఆనందంలో మునిగిపోయారు.