“బిజినెస్ మ్యాన్” రీ రిలీజ్ కి వేరే లెవెల్లో ప్లాన్!

Businessman

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ బిజినెస్ మ్యాన్. ఈ చిత్రం మహేష్ బాబు ను ఇండస్ట్రీ లో మరో లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రం. మాస్ ఆడియెన్స్ ను ఈ సినిమా ఎంతో బాగా ఆకట్టుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్ట్ 9) సందర్భంగా గ్రాండ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని వేరే లెవెల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ తెగ నడుస్తోంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇప్పుడు మరోసారి మహేష్ వంతు వచ్చింది. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version