‘జన నాయకుడు’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్? ఆరోజున తేలిపోతుంది అంతా

Jana-Nayagan

ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “జన నాయగన్”. తెలుగులో జన నాయకుడు గా రిలీజ్ కి వస్తున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా వచ్చిన సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమాగా వస్తుండగా ఇంకా ఎలాంటి ట్రైలర్ లాంటివి లేకుండానే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా ట్రైలర్ పై ఫైనల్ గా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం జన నాయకుడు ట్రైలర్ ని మేకర్స్ జనవరి 2న విడుదల చేయబోతున్నారట. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమా రీమేకా కాదా అని ఉన్న చాలా సందేహాలకు దాదాపు ఆరోజునే సమాధానం కూడా దొరికేయొచ్చు. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే జనవరి 9న ఈ సినిమా విడుదల కాబోతుంది.

Exit mobile version