స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ తమిళ మీడియాతో పాటు సోషల్ మీడియాలో మళ్లీ జోరుగా ప్రచారం సాగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ విడుదలైన తర్వాత, వచ్చే నవంబర్ రెండో వారంలో వీరి వివాహం జరగవచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
గత ఏడాది కాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో ఒకసారి ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు, అనిరుధ్ స్పందిస్తూ పుకార్లను నమ్మవద్దని సోషల్ మీడియా ద్వారా కొట్టిపారేశాడు. అయితే, గత ఏడాది వీరిద్దరూ న్యూయార్క్‌లో కలిసి కనిపించడంతో ఈ చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా, అనిరుధ్ బాబాయ్, ప్రముఖ నటుడు వై.జి. మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ పెళ్లి త్వరలోనే ఉంటుందని హింట్ ఇవ్వడంతో ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరింది. అయితే ఆయన వధువు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు.
ప్రస్తుతం అనిరుధ్ రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ సినిమాలతో ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. మరోవైపు, కావ్య మారన్ ‘సన్ రైజర్స్ హైదరాబాద్’ ఐపీఎల్ టీమ్ బాధ్యతలతో పాటు సన్ గ్రూప్ మీడియా వ్యాపారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మరి వీరి వివాహంపై ఏదైనా అధికారిక క్లారిటీ వస్తుందేమో చూడాలి.
